Asaduddin Owaisi: అసదుద్దీన్ ఒవైసీకి బరేలీ కోర్టు నోటీసులు.! 12 d ago
ఎంపీ అసదుద్దీన్ ఒవైసీకి యూపీలోని బరేలీ కోర్టు నోటీసులు జారీ చేసింది. లోక్‌సభలో ఎంపీగా ప్రమాణస్వీకారం సందర్భంగా జై పాలస్తీనా అని నినదించడాన్ని తప్పుబడుతూ, న్యాయవాది వీరేంద్ర గుప్తా కోర్టును ఆశ్రయించారు. చట్టసభలో జై పాలస్తీనా అని నినదించి రాజ్యాంగ, న్యాయ సూత్రాలను ఒవైసీ ఉల్లంఘించారని పిటీషనర్ ఆరోపించారు. ఈ కేసులో జనవరి 7న తమ ముందు హాజరు కావాలని ఒవైసీని కోర్టు ఆదేశించింది.